తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మరో ఐదేళ్లలో రోడ్డు ప్రమాదాలను 50శాతం తగ్గిస్తాం' - నితిన్​ గడ్కరీ వార్తలు

రాబోయే ఐదేళ్లలో రోడ్డు ప్రమాదాలను కనీసం 50 శాతానికి తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ తెలిపారు. ఇందుకోసం రోజుకు 30 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణ పనులు చేపడుతున్నామని.. త్వరలోనే దీన్ని 40 కి.మీ.కు విస్తరిస్తామన్నారు.

Union Minister Nitin Gadkari
'మరో ఐదేళ్లలో రోడ్డు ప్రమాదాల్ని 50% తగ్గిస్తాం'

By

Published : Jan 18, 2021, 5:28 PM IST

రోడ్డు ప్రమాదాల్లో సంభవించే మరణాలను 2025 లోపు 50 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ. దిల్లీలోని విజ్ఞాన్​ భవన్​లో జాతీయ రహదారి భద్రత మాసాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

2030వరకు వేచిచూస్తే 6 నుంచి 7 లక్షల మంది ప్రమాదం బారినపడి మరణించే అవకాశముందన్న గడ్కరీ.. అందువల్లే తమ లక్ష్యాన్ని ఐదేళ్లకు కుదించినట్టు చెప్పారు. ప్రజల సహకారంతో నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించవచ్చని స్పష్టం చేశారు. రోజుకు 30 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. మార్చి నెలాఖరులోగా రోజుకు 40 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు మంత్రి.

ఇదీ చదవండి:సువేందుపై మమత గురి- నందిగ్రామ్​ నుంచి పోటీ

ABOUT THE AUTHOR

...view details