లాక్డౌన్ మార్గదర్శకాల్లో కేంద్రం పలు మార్పులు చేసింది. వృద్ధుల సంరక్షకులు సహా, ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జీలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు కల్పిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో పిండి మిల్లులు, బ్రెడ్ ఫ్యాక్టరీలు కార్యకలాపాలు కొనసాగించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.
లాక్డౌన్ నుంచి వీటికి మినహాయింపు
వృద్ధుల సంరక్షకులు, ప్రీ పెయిడ్ మొబైల్ రీఛార్జీలు సహా పలు సేవలను లాక్డౌన్ నుంచి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదివరకు మార్గదర్శకాల్లో పేర్కొన్న మినహాయింపులకు సంబంధించి సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ స్పష్టం చేసింది.
హోంమంత్రిత్వ శాఖ
ఇప్పటివరకు జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్న మినహాయింపులకు సంబంధించి సమీక్ష నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ స్పష్టం చేసింది.
అయితే కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, దుకాణాల వద్ద తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. జిల్లా అధికారులకు ఉత్తర్వుల సమాచారం అందించి క్షేత్ర స్థాయిలో అస్పష్టతను నివారించాలని నివేదికలో పేర్కొంది.