అందానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే మహిళలు వేసవిలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎండ నుంచి చర్మాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. వేసవిలో ఫ్యాషన్ దుస్తులు ధరిస్తే.. సూర్యకిరణాలు చర్మాన్ని తాకే అవకాశమున్నందున.. అమ్మాయిలు ఈ తరహా దుస్తులు వేసుకునేందుకు కాస్త ఆలోచిస్తారు. పొడవాటి దుస్తులు ధరించేందుకు ప్రాధాన్యమిస్తారు. ఈ జాగ్రత్తలతోపాటు మీ హ్యాండ్‌బ్యాగ్‌లో నిత్యం కొన్ని వస్తువులు ఉంటే.. భానుడి భగభగలు మీ సౌందర్యాన్ని ఏమీ చేయలేవు.
సన్ స్క్రీన్ లోషన్
వేసవిలో భానుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు చర్మానికి హాని చేస్తాయి. నిగారింపును తగ్గిస్తాయి. అయితే సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించొచ్చు. అందుకు నిత్యం సన్‌స్క్రీన్ లోషన్‌ను హ్యాండ్‌బ్యాగ్‌లో తప్పనిసరిగా ఉంచుకోవాలి. ప్రొటెక్షన్ ఫ్యాక్టర్(ఎస్పీఎఫ్) 15, అంతకంటే ఎక్కువ ఉండే సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవాలి.
వెట్ వైప్స్
సాధారణంగా వేసవిలో చెమట ఎక్కువగా వస్తుంది. దీనివల్ల చర్మంపై అధికంగా దుమ్ము, ధూళి చేరుతుంది. వెట్ వైప్స్ వాడడం వల్ల చర్మంపై ఉన్న దుమ్ము, ధూళి తుడిచివేయొచ్చు. ముఖం, శరీరం తాజాగా కనిపించేందుకు ఇది ఎంతో సహకరిస్తుంది.
లిప్‌బామ్
వేసవిలో చర్మం పొడిబారుతుంది. అందుకే మాయిశ్చరైజర్ తప్పనిసరిగా వాడాలి. ముఖ్యంగా పెదవులు పొడిబారి పగిలిపోతాయి. అందుకు హైడ్రేటెడ్, రక్షణనిచ్చే మాయిశ్చరైజింగ్ లిప్‌బామ్‌లను వాడాలి. ఇవి కూడా ఏవి పడితే అవి వాడేయకుండా మంచి వాటినే వాడాలి.
రోజ్‌వాటర్