తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఈ సేవలకు కేంద్రం ఓకే - lcokdown news

లాక్​డౌన్ 3.0లో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పలు సేవలకు కేంద్రం అనుమతిచ్చింది. ఈ ప్రాంతాల్లో సెలూన్లు, ఆన్​లైన్​లో నిత్యావసరాలు సహా ఇతర వస్తువులను ఈ-కామర్స్ సంస్థలు విక్రయించవచ్చని స్పష్టం చేసింది.

Barber shops
గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఈ సేవలకు కేంద్రం ఓకే

By

Published : May 2, 2020, 3:02 PM IST

మే 4 నుంచి 14 రోజుల పాటు అమలు కానున్న లాక్​డౌన్​ 3.0 నిబంధనలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మరింత స్ఫష్టతనిచ్చింది. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నిత్యావసరేతర వస్తువులు విక్రయించేందుకు ఈ-కామర్స్ సంస్థలకు అనుమతిచ్చింది. అలాగే ఈ ప్రాంతాల్లో బార్బర్​ షాపులు, సెలూన్లు​ తెరిచేందుకు ఆమోదం తెలిపింది.

మే 17 వరకు పొడిగించిన లాక్​డౌన్​లో పలు ఆంక్షలను సడలించినట్లు చెప్పారు కేంద్ర హోం శాఖ అధికార ప్రతినిధి. గ్రీన్, ఆరెంజ్​ జోన్లలో పలు సేవలను పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.

లాక్​డౌన్​ను పొడిగిస్తూ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం హోం శాఖ. నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది.

ABOUT THE AUTHOR

...view details