తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తరప్రదేశ్ మహాకూటమికి బీటలు - BAHUJAN SAMJ PARTI

బహుజన్ సమాజ్​ పార్టీ భవిష్యత్తులో ఒంటరిగానే ఎన్నికల బరిలో నిలుస్తుందని స్పష్టం చేశారు ఆ పార్టీ అధినేత్ర మాయావతి. గతాన్ని మరిచిపోయి ఎస్పీతో జట్టుకట్టామన్నారు. మహాకూటమి ధర్మానికి కట్టుబడి పనిచేసినట్లు గుర్తు చేశారు. కానీ ఎన్నికల అనంతరం ఎస్పీ ప్రవర్తన మారిందన్నారు.

ఉత్తరప్రదేశ్ మహాకూటమికి బీటలు

By

Published : Jun 24, 2019, 12:36 PM IST

బహుజన సమాజ్​ పార్టీ భవిష్యత్తు కార్యచరణపై స్పష్టతనిచ్చారు ఆ పార్టీ అధినేత్రి మాయావతి. భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు.

గతాన్ని మర్చిపోయి సమాజ్​వాదీ పార్టీతో జట్టుకట్టామన్నారు మాయావతి. లోక్​సభ ఎన్నికల్లో మహాకూటమి ధర్మానికి బీఎస్పీ కట్టుబడి పనిచేసిందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎస్పీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందన్నారు.

ఎన్నికల తరువాత ఎస్పీ ప్రవర్తన వల్ల భవిష్యత్తులో భాజపాను ఓడించగలమా అనే సందేహాలు తలెత్తాయని ఆరోపించారు.

ఇదీ చూడండి: 'జమిలి ఎన్నికల పేరుతో భాజపా కుట్ర'

ABOUT THE AUTHOR

...view details