విశ్వవిఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్ర చివరి దశకు చేరుకుంది. తొమ్మిది రోజుల పాటు జరిగిన ఉత్సవాలు నేటి బహుడా రథయాత్రతో ముగియనున్నాయి. గుండిచా దేవాలయం నుంచి జగన్నాథ ఆలయానికి మూడు భారీ రథాల్లో శ్రీకృష్ణ, బలరామ, సుభద్రలు నేడు తిరుగుముఖం పట్టారు.
ఆటపాటలతో ఇంటికి బయలుదేరిన జగన్నాథుడు - జగన్నాథ ఆలయం
ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్రలో చివరి అంకం మొదలయింది. బహుడా రథయాత్రలో భాగంగా గుండిచా దేవాలయం నుంచి జగన్నాథ ఆలయానికి శ్రీకృష్ణ, బలరామ, సుభద్రలు తిరుగు ప్రయాణం అయ్యారు.
జగన్నాథుడు
రథాల తిరుగు ప్రయాణానికి భారీ ఏర్పాట్లు చేసింది ఒడిశా ప్రభుత్వం. ఆట పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ రథాలు జగన్నాథ సన్నిధికి చేరుకుంటున్నాయి. చేరుకున్నాక దేవతా మూర్తులను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. తర్వాత గర్భ గుడిలోని రత్న సింహాసనంపైకి చేర్చగానే యాత్ర సమాప్తమవుతుంది.
ఇదీ చూడండి: జగన్నాథ రథయాత్ర: భక్త సంద్రంగా పూరీ