దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ అనుమానాస్పద ఆర్డీఎక్స్ బ్యాగ్ కలకలం రేపింది. భద్రతా కారణాల రీత్యా పోలీసులు రెండు గంటలపాటు ప్రయాణికులపై ఆంక్షలు విధించారు. ఉదయం 4 గంటల తరువాతే ప్రయాణికులను బయటకు వెళ్లడానికి అనుమతించారు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ రోజు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో విమానాశ్రయంలోని మూడో టెర్మినల్ గేట్ నెంబర్ 2 వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఓ నల్లని రంగు సంచిని అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని.. అక్కడ నుంచి తరలించారు.