కశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లా దంగెర్పొరాలో ఓ ఇంట్లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు.
కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు.. నలుగురికి గాయాలు - కశ్మీర్
జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లా దంగెర్పొరాలో ఓ కుటుంబంపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. ఈ దుర్ఘటనలో ఓ చిన్నారి సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఉగ్రవాదుల కాల్పులు
ఈ దుశ్చర్యతో కుటుంబంలోని ఓ చిన్నారి సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు వైద్యులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: చంద్రయాన్-2: 'ల్యాండర్ కష్టమే- ఆర్బిటర్ భద్రం'
Last Updated : Sep 29, 2019, 6:14 PM IST