బాబ్రీ మసీదు కేసులో భాజపా అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్.కె.అడ్వాణీ వాంగ్మూలాన్ని జులై 24న నమోదు చేయాలని లఖ్‌నవూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయించింది. సీఆర్పీసీ సెక్షన్ 313 కింద అడ్వాణీ స్టేట్మెంట్ను... వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రికార్డు చేయనున్నట్లు స్పష్టం చేసింది.
జోషి, ప్రధాన్‌ను కూడా
బాబ్రీ కేసులో అడ్వాణీతో పాటు నిందితులుగా ఉన్న భాజపా సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి వాంగ్మూలాన్ని జులై 23న నమోదు చేయనున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జ్ ఎస్.కె.యాదవ్ తెలిపారు. శివనేన మాజీ ఎంపీ సతీష్ ప్రధాన్‌ను జులై 22న వీడియో లింక్ ద్వారా ప్రశ్నించనున్నట్లు స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశం మేరకు... సీఆర్పీసీ సెక్షన్ 313 కింద బాబ్రీ కేసు విచారిస్తోంది సీబీఐ ప్రత్యేక కోర్టు. ఆగస్టు 31 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయనుంది.
ఇదీ చూడండి:ఆయన ఓ పనికిరాని వ్యక్తి: అశోక్ గహ్లోత్