తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దుమారం రేపిన డోభాల్​పై ఆజాద్ వ్యాఖ్యలు..!

కశ్మీర్​ వీధుల్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​ పర్యటించడంపై కాంగ్రెస్​ నేత గులాం నబీ ఆజాద్​ విమర్శలు చేశారు. డబ్బులిచ్చి ఎవరినైనా తెచ్చుకోవచ్చు అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. డోభాల్​పై చేసిన వ్యాఖ్యలకు ఆజాద్​ క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేసింది భాజపా.

By

Published : Aug 8, 2019, 2:28 PM IST

Updated : Aug 8, 2019, 3:12 PM IST

డోభాల్​పై ఆజాద్ వ్యాఖ్యల దుమారం.. భాజపా ఆగ్రహం

ఆర్టికల్​ 370 రద్దు, జమ్ముకశ్మీర్​ విభజన జరిగాక కశ్మీర్​ లోయలో పర్యటించిన డోభాల్​​.. షోపియాన్​ జిల్లాలోని రోడ్లపై సాధారణ జనంతో కలిసి భోజనం చేస్తూ కనిపించారు. ఆయన పర్యటనపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​. 'డబ్బులిచ్చి ఎవరినైనా తెచ్చుకోవచ్చు' అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

దుమారం రేపిన డోభాల్​పై ఆజాద్ వ్యాఖ్యలు..!

క్షమాపణలకు డిమాండ్​..

కాంగ్రెస్​ నేత ఆజాద్​పై ఎదురుదాడికి దిగింది భాజపా. డోభాల్​ కశ్మీర్​ పర్యటనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేసింది. ఆజాద్​ వ్యాఖ్యలను తప్పుబట్టారు భాజపా అధికార ప్రతినిధి షానవాజ్​ హుస్సేన్​.

" ఆజాద్​ వ్యాఖ్యలు దురదృష్టకరం. డబ్బులిచ్చి మనుషులను తెచ్చినట్లు కాంగ్రెస్​ చెప్పాలనుకుంటోందా? ఇలాంటి వ్యాఖ్యలను పాకిస్థాన్ ప్రజల నుంచి మాత్రమే ఊహించవచ్చు. భారత్​లో అతిపెద్ద రాజకీయ పార్టీ నుంచి కాదు. ఈ వ్యాఖ్యలను అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్​ దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం."

- షానవాజ్​ హుస్సేన్​, భాజపా అధికార ప్రతినిధి

ఇదీ చూడండి: ఆర్టికల్ 370 రద్దుపై అత్యవసర విచారణకు నో

Last Updated : Aug 8, 2019, 3:12 PM IST

ABOUT THE AUTHOR

...view details