శబరిమలలో అయ్యప్ప దర్శనం ప్రశాంతంగా కొనసాగుతోంది. స్వామియే శరణం అయ్యప్ప అంటూ శబరిగిరులు మార్మోగుతున్నాయి. మండల పూజ కోసం అయ్యప్ప ఆలయ ద్వారాలు నిన్న సాయంత్రం తెరుచుకున్నాయి. ప్రధాన పూజారి కండారు మహేశ్ మోహనారు, ముఖ్య పూజారి ఏకే సుధీర్ నంబూద్రి ఆలయంలో శుద్ధి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గర్భగుడిని తెరిచారు. డిసెంబర్ 27 వరకు స్వామివారికి నిత్య పూజలు జరుగుతాయి. అనంతరం. మూడు రోజుల పాటు అయ్యప్ప ఆలయాన్ని మూసివేయనున్నారు. మకరవిలక్కు ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 30వ తేదీన ఆలయద్వారాలు తిరిగి తెరుచుకోనున్నాయి. జనవరి 20వ తేదీ వరకూ పూజలు నిర్వహించనున్నారు.
శబరిమల: రెండోరోజు ప్రశాంతంగా అయ్యప్ప దర్శనం - kerala shabarimala temple
అయ్యప్ప నామస్మరణతో శబరిమల మార్మోగుతోంది. రెండోరోజు స్వామివారి దర్శనం ప్రశాంతంగా కొనసాగుతోంది. మండలపూజ కోసం నిన్న సాయంత్రం ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి.
ప్రశాంతంగా శబరిమల అయ్యప్ప దర్శనం
అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా కేరళ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు 10వేల మందికి పైగా పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: గౌతమ్ గంభీర్ కనిపించడం లేదు..!