తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆయుష్మాన్'​తో భారతీయులకు సాధికారత: మోదీ - ఆయుష్మాన్​ భారత్ పథకం

ఆయుష్మాన్​ భారత్​ పథకంతో దేశప్రజలు సాధికారత వైపు సాగుతున్నారని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. గతేడాది తీసుకొచ్చిన ఈ పథకంతో దేశవ్యాప్తంగా 50 లక్షల మంది పేదవారు లబ్ధి పొందారని ట్వీట్​ చేశారు.

'ఆయుష్మాన్'​తో భారతీయుల సాధికారత: మోదీ

By

Published : Oct 15, 2019, 3:59 PM IST

పేదవారికి రూ.5లక్షల వైద్య బీమాను అందిస్తున్న ఆయుష్మాన్ భారత్​ పథకం వృద్ధిని ప్రధాని కొనియాడారు. గతేడాది తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 50 లక్షల మంది లబ్ధిపొందారని ప్రకటించారు. ఎంతోమంది భారతీయులు సాధికారత సాధించేందుకు ఆయుష్మాన్​ భారత్​ దోహదపడుతోందని ట్వీట్​ చేశారు.

"ఆరోగ్యకరమైన భారతదేశాన్ని సృష్టించే ప్రయాణంలో ఇదొక మైలురాయి! ఆయుష్మాన్​ భారత్​ ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసింది. ఏడాదిలో దేశవ్యాప్తంగా 50 లక్షల మందికి ఉచిత వైద్య సదుపాయాల లబ్ధి పొందేలా చేసినందుకు ఆయుష్మాన్ భారత్​కు ధన్యవాదాలు."
- ప్రధాని నరేంద్రమోదీ

10 కోట్ల మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు రూ.5 లక్షల వైద్య బీమా అందించే లక్ష్యంతో 2018 సెప్టెంబర్​లో ఈ పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.

ABOUT THE AUTHOR

...view details