తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్యపై మధ్యవర్తిత్వం ప్రారంభం

అయోధ్య సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ ప్యానెల్​ మధనం ప్రారంభించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన కమిటీ ముందు 25 మంది పిటిషనర్లు హాజరయ్యారు.

అయోధ్యపై మధ్యవర్తిత్వం ప్రారంభం

By

Published : Mar 14, 2019, 11:18 AM IST

అయోధ్యపై మధ్యవర్తిత్వం ప్రారంభం
అయోధ్య సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన ప్యానెల్​ మధ్యవర్తిత్వాన్ని ప్రారంభించింది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ముందు 25 మంది పిటిషనర్లు హాజరయ్యారు. వీరి తరఫున న్యాయవాదులు, ఇతరులు సహా మొత్తం 50 మందికి పైగా ప్యానెల్​ ముందుకు వచ్చారు. మధ్యవర్తిత్వంలో అత్యంత గోప్యత పాటించాలని సుప్రీం ఆదేశించింది. ఈ మేరకు ప్యానెల్​ ఉన్న అవధ్​ విశ్వవిద్యాలయం ఆవరణలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

కార్యక్రమం సామరస్యపూర్వకంగా జరిగిందని రామ జన్మభూమి పునరుద్ధర్​ సమితికి చెందిన స్వామి అవిముక్తేశ్వరానంద తెలిపారు. నిన్న ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో మొత్తం 50 మందికి పైగా పాల్గొన్నారని వెల్లడించారు.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ ఎఫ్​ ఎమ్​ ఐ ఖీలీఫుల్లా అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్​, సీనియర్​ న్యాయవాది శ్రీరామ్​ పంచు సభ్యులుగా ఉన్నారు.

అయోధ్యలో వివాదాస్పదమైన రామ జన్మభూమి-బాబ్రీ మసీదు సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు సుప్రీం గతవారం మధ్యవర్తిత్వ ప్యానెల్​ను ఏర్పాటు చేసింది.

ABOUT THE AUTHOR

...view details