తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'న్యాయవాదికి బెదిరింపులా.. ఇలా జరగాల్సింది కాదు'

అయోధ్య కేసును సున్నీ వక్ఫ్ బోర్డు తరపున వాదించకూడదంటూ న్యాయవాది రాజీవ్ ధావన్​కి వచ్చిన బెదిరింపులపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ​ ఇలా జరగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇలా జరిగి ఉండకూడదని వ్యాఖ్యానించింది.

'న్యాయవాదికి బెదిరింపులా.. ఇలా జరగాల్సింది కాదు'

By

Published : Sep 12, 2019, 1:07 PM IST

Updated : Sep 30, 2019, 8:07 AM IST

అయోధ్య కేసు వాదించొద్దంటూ బెదిరించారని సీనియర్ న్యాయవాది రాజీవ్​ ధావన్​ వేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఓ న్యాయవాదికి ఇలా బెదిరింపులు రావడం ఆమోదయోగ్యం కాదని, ఇలా జరగకూడదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

రాజీవ్​ ధావన్​ అయోధ్య కేసు విషయంలో ముస్లిం వర్గాల తరపున వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసును వాదించవద్దంటూ తనకు.. సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులు వస్తున్నాయని ఆయన సుప్రీంలో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.... ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఇద్దరు వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్​ నేతృత్వంలోని ధర్మాసనం.. అయోధ్య కేసును 22వ రోజు విచారించింది. ఈ సందర్భంగా... తనకు ఫేస్​బుక్ ద్వారా బెదిరింపులు వచ్చాయని రాజీవ్​ ధావన్​ పేర్కొన్నారు. అలాగే తన సహాయకులను న్యాయస్థానం ఆవరణలో కొందరు వ్యక్తులు దూషించారని తెలిపారు.
బెదిరింపుల వ్యవహారంపై ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

"న్యాయవాదులకు బెదిరింపులు రావడం ఆమోదయోగ్యం కాదు. ఇలా జరిగి ఉండకూడదు."

- జస్టిస్ రంజన్ గొగోయ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ఇదీ చూడండి:'ఆవుల గురించి కాదు ఆర్థిక వ్యవస్థపై మాట్లాడండి'

Last Updated : Sep 30, 2019, 8:07 AM IST

ABOUT THE AUTHOR

...view details