అయోధ్య భూవివాదం కేసు వాదించొద్దంటూ బెదిరించారని సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వేసిన ఫిర్యాదుపై స్పందించింది సుప్రీంకోర్టు. ధావన్ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఇద్దరు వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది.
అయోధ్య భూవివాదం కేసులో ముస్లింల తరఫున వాదనలు వినిపించొద్దని 2019 ఆగస్టు 14న విశ్రాంత విద్యా అధికారి ఎన్. శణ్ముగమ్ నుంచి తనకు లేఖ అందిందని ఫిర్యాదు చేశారు ధావన్. రాజస్థాన్ వాసి సంజయ్ కలాల్ వాట్సాప్ సంక్షిప్త సమాచారంలో కేసు వాదించొద్దని బెదిరింపులకు గురిచేసినట్లు పిటిషన్లో పేర్కొన్నారు రాజీవ్. సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున వాదించొద్దని హెచ్చరించినట్లు తెలిపారు.