తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య కేసు: 8వ రోజు విచారించని సుప్రీం - అయోధ్య

జస్టిస్​ బాబ్జే అందుబాటులో లేకపోవడం వల్ల సోమవారం సుప్రీం కోర్టులో అయోధ్య కేసు విచారణ జరగలేదు. 8వ రోజు పిటిషనర్​ రామ్​లల్లా తరఫు న్యాయవాది వైద్యనాథన్​ వాదనలు వినిపించాల్సి ఉంది.

అయోధ్య కేసు: 8వ రోజు విచారించని సుప్రీం

By

Published : Aug 19, 2019, 1:21 PM IST

Updated : Sep 27, 2019, 12:31 PM IST

నేడు సుప్రీంకోర్టులో వివాదాస్పద రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాదం కేసు విచారణ జరగలేదు. ఐదుగురు జడ్జిల ధర్మాసనంలో ఒకరు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయ్​ నేతృత్వంలోని ధర్మాసనం నేడు(8వ రోజు) రామ్​లల్లా తరఫు న్యాయవాది వైద్యనాథన్​ వాదనలు వినాల్సి ఉంది. జస్టిస్​ బాబ్డే అందుబాటులో లేకపోవడం వల్ల విచారణ జరగలేదు.

7వ రోజు విచారణలో భాగంగా... అయోధ్య వివాదాస్పద భూమిలో ఉన్న స్తంభాలపై హిందూ దేవతల చిత్రాలున్నాయని అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు వైద్యనాథన్​. భూమిని పరీక్షించడానికి కోర్టు నియమించిన కమిషనర్ అందించిన​ నివేదిక ద్వారా ఇది స్పష్టమవుతోందని అత్యున్నత న్యాయస్థానానికి వివరించారు.

అయోధ్య కేసు పరిష్కారంలో 'మధ్యవర్తిత్వం' విఫలమవడం వల్ల రోజువారీ విచారణ జరపడానికి అత్యున్నత న్యాయస్థానం ఇటీవలే నిర్ణయించింది.


ఇదీ చూడండి:- 'అయోధ్యలో స్తంభాలపై హిందూ దేవతలున్నారు
'

Last Updated : Sep 27, 2019, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details