తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుప్రీంలో 'ఆధార్​' రికార్డ్​ను బ్రేక్​ చేసిన 'అయోధ్య'

సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ సాగిన కేసుల విషయంలో 'ఆధార్​' రికార్డును 'అయోధ్య' బ్రేక్​ చేసింది. ఆధార్​ వ్యవహారంపై గతంలో 38రోజుల విచారణ సాగింది. అయోధ్య కేసు విచారణ 40 రోజులు సాగింది. తొలి స్థానంలో ఉన్న 'కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం' కేసులో 68 రోజుల పాటు వాదనలు ఆలకించింది సర్వోన్నత న్యాయస్థానం.

ayodhya crossed aadhar card case in supreme court

By

Published : Oct 16, 2019, 7:20 PM IST

Updated : Oct 16, 2019, 9:01 PM IST

సుప్రీంలో 'ఆధార్​' రికార్డ్​ను బ్రేక్​ చేసిన 'అయోధ్య'

దశాబ్దాల నాటి అయోధ్య కేసులో సుప్రీంకోర్టులో నేటితో వాదనలు ముగిశాయి. అభ్యంతరాల సమర్పించేందుకు గడువు ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది. ఏళ్లనాటి భూవివాదంలో తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

నవంబర్​ 17న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి పదవీ విరమణ ఉండటం వల్ల ఆ లోపే తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు నవంబర్​ 4 నుంచి 17 మధ్య సుప్రీం తన నిర్ణయం ప్రకటిస్తుందని పలువురు న్యాయవాదులు భావిస్తున్నారు.

"అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పును వాయిదా వేసింది. వివాదంపై తర్వలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేసింది. 23 రోజుల్లోపు తీర్పునిస్తామని తెలిపింది. "

-వరుణ్ సిన్హా, హిందూ మహాసభ తరఫు న్యాయవాది

రెండో సుదీర్ఘ విచారణ

సుప్రీంకోర్టు చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం విచారణ జరిగిన రెండో కేసుగా అయోధ్య భూవివాదం నిలిచింది. గతంలో 1972లో 'కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం' కేసులో 68 రోజుల పాటు విచారణ సాగింది. ప్రాథమిక హక్కుల అంశంపై 13 మంది న్యాయమూర్తులు వాదనలు విన్నారు.

ఆ తర్వాత ఇప్పటివరకు రెండో స్థానంలో 38 రోజుల విచారణతో ఆధార్ కేసు ఉండేది. 40 రోజుల పాటు సాగిన విచారణతో ఆ రికార్డును అయోధ్య భూవివాదం అధిగమించింది.

ఇదీ చూడండి: అయోధ్య కేసు విచారణ సమాప్తం- తీర్పుపై ఉత్కంఠ

Last Updated : Oct 16, 2019, 9:01 PM IST

ABOUT THE AUTHOR

...view details