తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అయోధ్యలో ఆలయం స్థానంలో మసీదు నిర్మించారు' - అయోధ్య

సుప్రీంకోర్టులో అయోధ్య భూవివాద కేసు విచారణ 8వ రోజున పిటిషనర్​ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. హిందూ ఆలయం స్థానంలో మసీదు నిర్మించారని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించారు న్యాయవాది వైద్యనాథన్​.

'అయోధ్యలో ఆలయం స్థానంలో మసీదు నిర్మించారు'

By

Published : Aug 20, 2019, 12:19 PM IST

Updated : Sep 27, 2019, 3:31 PM IST

'అయోధ్యలో ఆలయం స్థానంలో మసీదు నిర్మించారు'

వివాదాస్పద అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు 8వ రోజు విచారణ చేపట్టింది. పిటిషనర్​ రామ్​లల్లా తరఫున న్యాయవాది వైద్యనాథన్​ వాదనలు వినిపించారు. అయోధ్యలో హిందూ ఆలయం స్థానంలో మసీదును నిర్మించారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయ్​ నేతృత్వంలోని ధర్మాసనానికి వైద్యనాథన్​ నివేదించారు.

తన వాదనకు బలాన్ని చేకూర్చడానికి పురావస్తుశాఖ(ఏఎస్​ఐ) నివేదికను ప్రస్తావించారు వైద్యనాథన్​. వివాదాస్పద భూమి వద్ద మొసలి, తాబేలు చిత్రాలున్నాయని... వాటితో మస్లిం సంప్రదాయానికి సంబంధం లేదని వివరించారు.

అయోధ్య కేసు పరిష్కారంలో 'మధ్యవర్తిత్వం' విఫలమవడం వల్ల రోజువారీ విచారణ జరపడానికి అత్యున్నత న్యాయస్థానం ఇటీవలే నిర్ణయించింది. అయితే జస్టిస్​ బాబ్డే అందుబాటులో లేకపోవడం వల్ల సోమవారం సుప్రీంకోర్టులో అయోధ్య కేసు విచారణ జరగలేదు.

ఇదీ చూడండి:- చందమామ కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్​-2

Last Updated : Sep 27, 2019, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details