ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి నేత్రామ్ రూ.300 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు నిర్ధరించారు. దాడుల్లో మొత్తం రూ.225 కోట్లకు పన్ను చెల్లించలేదని నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. బుధవారం 12 వేర్వేరు చోట్ల జరిపిన సోదాల్లో రూ.1.64 కోట్ల నగదు, రూ.50 లక్షల విలువైన మోంట్ బ్లాంక్ పెన్నులను స్వాధీనం చేసుకున్నారు.
ఐఏఎస్ పెన్నుల విలువే 50లక్షలు - IAS
ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి నేత్రామ్ రూ.300 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారుల దాడుల్లో వెల్లడైంది. 12 వేర్వేరు చోట్ల జరిపిన సోదాల్లో రూ.1.64 కోట్ల నగదు, రూ.50 లక్షల విలువైన మోంట్ బ్లాంక్ పెన్నులను స్వాధీనం చేసుకున్నారు.
నేత్రామ్
కోల్‌కతాలోని పలు డొల్ల కంపెనీలకు రూ.95 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. ఈ నల్లధనంతో దిల్లీ, కోల్‌కతా, ముంబయిలో ఆరు విలాసవంతమైన ఇళ్లు కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. 1979 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ నేత్రామ్... అప్పటి యూపీ ముఖ్యమంత్రి మాయావతి వద్ద కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం యూపీలో ఓ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.