నేరాన్ని అడ్డుకున్నందుకు ట్రాఫిక్ పోలీసుపై దాడి - దాడి
బిహార్లోని ముజ్ఫర్పుర్లో ఓ ఆటోడ్రైవర్ పోలీసుపై దాడి చేశాడు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడని అడ్డుకోవడమే దీనికి కారణం.
అఘోరియా బజార్ చౌక్ వద్ద నిషేధిత మార్గంలో వెళ్తున్న ఆటోను విధుల్లో ఉన్న పోలీసు అడ్డుకున్నాడు. ఆగ్రహించిన ఆటో డ్రైవర్, అతడి స్నేహితులు కలిసి ఆ పోలీసుపై దాడి చేశారు. చుట్టుపక్కన వారు వారించే ప్రయత్నం చేసినా డ్రైవర్ ఆగలేదు. అతన్ని కొట్టుకుంటూ కొంతదూరం లాక్కెళ్లారు. ఇంతలో కొందరు స్థానికులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు రాగానే అక్కడ్నించి పరారయ్యారు దుండగులు. దాడిలో గాయపడ్డ పోలీసు సమీప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.