అగస్టా కేసులో సుసేన్ గుప్తా కస్టడీ పొడిగింపు - augasta westland
అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోళ్ల కుంభకోణంలో సుసేన్ మోహన్ గుప్తా కస్టడీని మూడు రోజులు పొడిగించింది దిల్లీకోర్టు. ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అభ్యర్థన మేరకు సుసేన్ మోహన్ కస్టడీని పెంచుతూ కోర్టు తీర్పునిచ్చింది.
అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మేనల్లుడు సుసేన్ మోహన్ గుప్తా కస్టడీని మూడు రోజులు పెంచుతూ దిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. రక్షణశాఖ ఏజెంట్‌గా పనిచేసిన సుసేన్ మోహన్‌ను ప్రశ్నించేందుకు మరో మూడు రోజుల కస్టడీ పెంచాలని ఈడీ(ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) కోర్టును ఆశ్రయించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభ్యర్థన మేరకు గుప్తా కస్టడీని మరో మూడు రోజులు పెంచుతూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. రూ.3600 కోట్ల వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోళ్ల కుంభకోణంలో సుసేన్ మోహన్ గుప్తాను ఈడీ అరెస్ట్ చేసింది.