ఝార్ఖండ్‌లో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చివరిదైన ఐదో దశలో నేడు 16 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటలవరకు 70.83 శాతం మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఝార్ఖండ్‌లో ముగిసిన పోలింగ్- 23న ఫలితం
ఝార్ఖండ్‌లో శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 81 నియోజకవర్గాలకు 5 దశల్లో ఓటింగ్ జరగ్గా... ఈనెల 23న ఫలితం వెలువడనుంది.
ఝార్ఖండ్‌లో ప్రశాంతంగా ముగిసిన ఐదో దశ పోలింగ్
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన బోరియో, బర్‌హెట్, లితిపార, మహేశ్‌పుర, శికారిపార నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగిసింది. ఝార్ఖండ్‌లోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఐదు విడతలుగా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20 వరకూ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి.
ఇదీ చదవండి:జడ్జీలను అగౌరవపరిచిన న్యాయవాదులపై చర్యలకు డిమాండ్