తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎన్​ఆర్​సీ మినహాయింపు జాబితా ఆన్​లైన్​లోనే'

అసోం జాతీయ పౌర రిజిస్టర్​(ఎన్​ఆర్​సీ)పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్​ఆర్​సీ తుది జాబితా నుంచి మినహాయించిన వారి పేర్లను ఈ నెల 31న అంతర్జాలం ద్వారానే ప్రచురించాలని సూచించింది.

'ఎన్​ఆర్​సీ మినహాయింపు జాబితా ఆన్​లైన్​లోనే'

By

Published : Aug 13, 2019, 12:40 PM IST

Updated : Sep 26, 2019, 8:41 PM IST

అసోం జాతీయ పౌర రిజిస్టర్​ తుది జాబితా నుంచి మినహాయించిన పేర్లను ఈ నెల 31న అంతర్జాలం ద్వారానే ప్రచురించాలని ఆదేశించింది సుప్రీం కోర్టు.

ఆధార్​ తరహాలో అసోం ఎన్​ఆర్​సీ సమాచార భద్రతకు తగిన వ్యవస్థ రూపొందించాలని సూచించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి, జస్టిస్​ ఆర్​ఎఫ్​ నారీమన్​తో కూడిన ధర్మాసనం. న్యాయపరమైన అభ్యంతరాలు లేవనెత్తినంత మాత్రాన... ప్రస్తుత ఎన్​ఆర్​సీ ప్రక్రియను తిరిగి పునఃసమీక్షించాలని ఆదేశించలేమని స్పష్టం చేసింది.

ఎన్​ఆర్​సీ తుది జాబితా ఆగస్టు 31లోపు విడుదల చేయాలని గతంలోనే ఆదేశించింది న్యాయస్థానం.

ఇదీ చూడండి: ఎన్​ఆర్​సీ తుది జాబితా ఖరారు గడువు పెంపు

Last Updated : Sep 26, 2019, 8:41 PM IST

ABOUT THE AUTHOR

...view details