వైద్యులు శస్త్రచికిత్స ద్వారా ఓ వ్యక్తి మూత్రాశయం నుంచి మొబైల్ ఛార్జర్ వైర్‌ను విజయవంతంగా తొలగించారు. ఈ ఘటన అసోంలో చోటుచేసుకుంది. ఇస్లాం అనే వైద్యుడు ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మూత్రాశయంలో మొబైల్ ఛార్జర్ కేబుల్!
అసోంలో ఓ వ్యక్తి మూత్రాశయం నుంచి మొబైల్ ఛార్జర్ వైర్‌ను బయటకు తీశారు వైద్యులు. ఛార్జింగ్ కేబుల్‌ను తిన్నట్లు బాధితుడు తొలుత చెప్పినప్పటికీ.. ఎక్స్‌రేలో అసలు విషయం బయటపడిందని వైద్యులు తెలిపారు. పురుషాంగం ద్వారా కేబుల్‌ను శరీరంలోకి చొప్పించుకున్నట్లు స్పష్టం చేశారు
గువాహటికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన కడుపునొప్పితో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. తాను పొరపాటున మొబైల్ ఛార్జింగ్ కేబుల్ వైర్‌ను తిన్నట్లు వైద్యుడికి వివరించాడు. శస్త్ర చికిత్స చేసేందుకు ఎక్స్‌రే తీయగా.. అసలు నిజం బయటపడింది.
వైద్యులను తప్పుదారి పట్టించేందుకు సదరు వ్యక్తి ఆవిధంగా చెప్పాడని వైద్యుడు వెల్లడించారు. తన పురుషాంగం ద్వారా కేబుల్‌వైర్‌ను చొప్పించుకున్నాడని పేర్కొన్నారు. అతడి మానసిక స్థితిపై కూడా అనుమనాలున్నాయన్నారు. శస్త్రచికిత్స చేసి కేబుల్ వైర్‌ను బయటకు తీశామని, ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఇస్లాం వెల్లడించారు.