అసోం జాతీయ పౌర జాబితాపై దేశవ్యాప్తంగా అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. 19 లక్షల మంది ప్రజలకు జాబితాలో చోట దక్కకపోవటంపై విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. చోటు దక్కని భారతీయులకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
న్యాయపోరాటం: కాంగ్రెస్
ఎన్ఆర్సీ జాబితాపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జాబితాలో చోటు దక్కిని వారికి మద్దతుగా కాంగ్రెస్ నిలుస్తుందని ప్రకటించారు నాయకులు. చోటు దక్కని నిజమైన భారత పౌరులకు బాసటగా నిలుస్తామన్నారు కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి. వారి కోసం న్యాయ పోరాటం చేస్తామన్నారు.
భరోసా కల్పించాలి: సీపీఎం
19 లక్షల మందికి చోటు దక్కకపోవటం ఆందోళనకలిగించే విషయమని పేర్కొంది సీపీఎం. జాబితాలో పేరు లేని నిజమైన భారత పౌరులను తిరిగి చేర్చుకుంటామని భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బాధితుల పరిస్థితి, హక్కులపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలని కోరింది. విదేశీ ట్రైబునళ్లకు న్యాయ అధికారాలు కల్పించాలని.. లేకుంటే ఉపయోగం ఉండదని అభిప్రాయపడింది.
భాజపా విఫలం:తరుణ్ గొగొయి