తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాలేయ సమస్యలతో లయన్​ సిద్ధార్థ్​ మృతి - సింహం

రాజస్థాన్​లోని నహర్​గఢ్​ బయోలాజికల్ పార్కులో ఎనిమిదేళ్ల సింహం మరణించింది. కాలేయ, మూత్రపిండాల సమస్యతోనే ఇది మరణించినట్లు అధికారులు తెలిపారు. పద్ధతి ప్రకారం, దానికి పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం దహన సంస్కారాలు పూర్తి చేశారు.

Asiatic lion Siddharth dies at Rajasthan's Nahargarh Biological Park, cremated
కాలేయ సమస్యలతో మృగరాజు సిద్ధార్థ్​ మృతి

By

Published : Jun 11, 2020, 12:01 PM IST

రాజస్థాన్​ జైపుర్​లోని నహర్​గఢ్​ బయోలాజికల్ పార్కులో సిద్ధార్థ్ అనే 8 సంవత్సరాల సింహం కాలేయ సంబంధ వ్యాధితో మరణించింది.​ పోస్టుమార్టం అయిన తరువాత ఆ సింహానికి పద్ధతి ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించినట్లు పార్క్ అధికారులు తెలిపారు.

మృతి చెందిన మృగరాజు

"జూన్ 6 నుంచి సిద్ధార్థ్​ (సింహం) ఏమీ తినడం లేదు. తాగడం లేదు. దీనితో దాని ఆరోగ్యం బాగా క్షీణించింది. సింహం రక్త నమూనాలను సేకరించి, పరీక్షల కోసం బరేలీలోని ఐవీఆర్​ఐకు పంపించాం. దానికి కాలేయ, మూత్రపిండాల (కిడ్నీ) సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సింహాన్ని రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది."

- బయోలాజికల్ పార్కుకు చెందిన ఓ అధికారి

2016లో నహర్​గఢ్ బయోలాజికల్​ పార్కును ప్రారంభించారు. దీనితో జునాగఢ్ పార్కు నుంచి సిద్ధార్థ్​ అనే సింహాన్ని నహర్​గఢ్ పార్కుకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఈ మృగరాజు పార్కుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

లయన్ సిద్ధార్థ్​
నహర్​గఢ్ బయోలాజికల్ పార్క్

ఇదీ చూడండి:'భాజపా ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25 కోట్లు ఎరవేస్తోంది'

ABOUT THE AUTHOR

...view details