తెలంగాణ

telangana

ETV Bharat / bharat

27 శాతం లోటు వర్షపాతం : ఐఎండీ

ప్రతి ఏడాది రుతుపవనాల రాకకు ముందు రైతులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. సరిపడా వర్షాలు పడితే పంట దిగుబడి పెంచుకోవచ్చని భావిస్తుంటారు. అయితే, ఈ ఏడాది రుతుపవనాల రాకకు ముందు రైతులకు గడ్డుకాలమే మిగిలింది. సాధారణం కంటే 27 శాతం లోటు వర్షపాతం నమోదై వ్యవసాయాన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది.

రుతుపవనాల రాకకు ముందు 27 శాతం లోటు వర్షపాతం

By

Published : Apr 29, 2019, 6:11 AM IST

రుతుపవనాల రాకకు ముందు దేశంలో లోటు వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. అధిక ఉష్టోగ్రతలతో దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ప్రకటించింది.

ఈ ఏడాది మార్చి నుంచి ఏప్రిల్​ వరకు దేశ వ్యాప్తంగా 43.3 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం 59.6 మిల్లీమీటర్లు కంటే 16.3 శాతం తక్కువ. దీర్ఘకాల సరాసరి వర్షపాతంతో(ఎల్​పీఏ) పోలిస్తే ఇది 27 శాతం తక్కువని పేర్కొంది. అత్యధికంగా వాయువ్య భారత్​ (ఉత్తరప్రదేశ్​, దిల్లీ, పంజాబ్​, హరియాణా, జమ్ము కశ్మీర్​, ఉత్తరాఖండ్​, హిమాచల్​ ప్రదేశ్​) ప్రాంతంలో 38 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ ప్రకటించింది.

దక్షిణ ద్వీపకల్పంలోని 5 రాష్ట్రాలు, పుదుచ్చేరి, గోవా, మహారాష్ట్ర తీరప్రాంతాల్లో 31 శాతం... తూర్పు, ఈశాన్య భారతంలో 23 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అయితే మధ్య భారత్​లో మాత్రమే 5 శాతం అధిక వర్షపాతం నమోదైందని ఐఎండీ అదనపు డైరెక్టర్​ జనరల్​ తెలిపారు.

"ఉద్యాన పంటలకు రుతుపవనాల ముందు కురిసే వర్షం ఎంతో ముఖ్యం. ఒడిశా లాంటి రాష్ట్రాల్లోని రైతులు ఇప్పటికే పంటపొలాలను దుక్కి దున్నారు."
- మృతుంజయ్​ మోహపత్రా, ఐఎండీ అదనపు డైరెక్టర్​ జనరల్​

మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర, గుజరాత్​, రాజస్థాన్​ రాష్ట్రాల్లో రుతుపవనాల రాకకు ముందు కురిసిన వర్షాలు, తుపానులు, పిడుగులతో దాదాపు 50 మంది దాకా మృత్యువాత పడ్డారు.

దేశంలోని పలుప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు తగ్గే సూచన కనిపించడం లేదని స్కైమెట్​ వాతావరణ సంస్థ కూడా ప్రకటించడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details