తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ అభివృద్ధికి కలిసి పనిచేద్దాం: 'షా'తో కేజ్రీవాల్​ - Home Minister Amit Shah

కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో సమావేశమయ్యారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. రెండు పార్టీలు సమన్వయంతో దిల్లీని అభివృద్ధి చేయాలని షాను కోరారు కేజ్రీవాల్​. అనంతరం భేటీ వివరాల్ని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

Arvind Kejriwal meets Home Minister Amit Shah
దిల్లీ అభివృద్ధికి కలిసి పనిచేద్దాం: 'షా'తో కేజ్రీవాల్​

By

Published : Feb 19, 2020, 5:32 PM IST

Updated : Mar 1, 2020, 8:53 PM IST

కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ బుధవారం భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత షాతో కేజ్రీవాల్​ సమావేశమవ్వడం ఇదే తొలిసారి. షా నివాసంలో దాదాపు 20 నిమిషాల పాటు ఇరువురూ చర్చలు జరిపారు.

దిల్లీ అభివృద్ధికి కోసం కలిసి పనిచేయాలని అమిత్​ షాను కోరారు కేజ్రీవాల్​. అనంతరం భేటీ వివరాల్ని ట్విట్టర్​లో వెల్లడించారు.

'గౌరవనీయులైన హోం మంత్రి అమిత్​ షాను కలిశాను. సమావేశం ఫలప్రదంగా సాగింది. దిల్లీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించాం. దిల్లీ అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఒక అంగీకారానికి వచ్చాం.''

- కేజ్రీవాల్​ ట్వీట్​

ఇటీవల జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, ఆప్‌ హోరా హోరీగా తలపడ్డాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్‌ 62 స్థానాల్లో జయభేరి మోగించింది. 8 స్థానాలను గెలుచుకుంది భాజపా. ఈ నెల 16న మూడోసారి హస్తిన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేజ్రీవాల్‌.. దిల్లీ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని ఉద్ఘాటించారు. తమకు నరేంద్ర మోదీ ఆశీస్సులు కావాలని ప్రసంగించారు.

దిల్లీ అభివృద్ధికి కలిసి పనిచేద్దాం: 'షా'తో కేజ్రీవాల్​

ఇదీ చూడండి:నమస్తే ట్రంప్​: యుద్ధ మేఘాల నుంచి స్నేహగీతాల వరకు...

Last Updated : Mar 1, 2020, 8:53 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details