బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ స్థావరాలపై దాడిని దేశమంతా సమర్థించిందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ప్రతిపక్షాలు మాత్రం ఆ అంశాన్ని రాజకీయం చేశాయని ట్విట్టర్లో పేర్కొన్నారు.
"ప్రతిపక్షాలకు మళ్లీ అదేగతి" - అరుణ్ జైట్లీ
బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం దాడులను ప్రతిపక్షాలు రాజకీయం చేయటం తగదని విత్త మంత్రి అరుణ్ జైట్లీ తప్పుబట్టారు.
ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు అరుణ్ జైట్లీ
విపక్షాలు దేశ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నాయని జైట్లీ అన్నారు. ఈ అంశాలు శత్రుదేశ మీడియాకు మనదేశంపై ఆరోపణలు చేసేందుకు అవకాశమిచ్చాయని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలు మళ్లీ అదే స్థానంలో ఉంటాయని భావిస్తున్నట్లు జైట్లీ తెలిపారు.