తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒడిశా పీఠం మళ్లీ నవీన్​ పట్నాయక్​దే.... - ఎన్నికలు

ఒడిశా ప్రజలు మరోమారు బిజూ జనతా దళ్​కే పట్టం కట్టారు. నవీన్ పట్నాయక్ సారథ్యంలోని అధికార బీజేడీ 112 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఐదో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు పట్నాయక్​. కానీ... లోక్​సభ ఎన్నికల్లో మాత్రం 2014లో 20 స్థానాలు గెల్చుకున్న బీజేడీ.. ఈ సారి 12కే పరిమితమైంది.

ఒడిశా పీఠం మళ్లీ పట్నాయక్​దే..!

By

Published : May 24, 2019, 5:59 AM IST

Updated : May 24, 2019, 8:18 AM IST

ఒడిశా పీఠం మళ్లీ పట్నాయక్​దే..!

లోక్​సభతో పాటు ఒడిశా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బిజూ జనతా దళ్ విజయదుందుభి మోగించింది. ఒడిశా శాసనసభలోని 146 స్థానాల్లో 112 సీట్లు సాధించింది. వరుసగా ఐదో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించనున్నారు నవీన్ పట్నాయక్. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్న భాజపా 23 సీట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. 9 స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం అయింది.

ఒడిశాలో 19 ఏళ్లుగా బిజూ జనతాదళ్​దే ఏకచ్ఛత్రాధిపత్యం. తొలిసారి 2000 సంవత్సరంలో పాలన పగ్గాలు చేపట్టారు నవీన్​ పట్నాయక్. ఆ తర్వాత తిరుగులేదు. 2004, 2009, 2014 ఎన్నికల్లోనూ గెలిచారు.

మొత్తం పోలింగ్​ స్థానాలు 146
బీజేడీ 112
భాజపా 23
కాంగ్రెస్ 9
ఇతరులు 2


సవాళ్ల సవారీ

ప్రజావ్యతిరేకతను ఎదుర్కొనేందుకు పదునైన వ్యూహాలు రచించారు పట్నాయక్. జనాకర్షక మంత్రంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. లోక్​సభ ఎన్నికల్లో 33 శాతం టికెట్లను మహిళలకే కేటాయిస్తామన్న ప్రకటనతో ఆ వర్గం ఓట్లపై గురిపెట్టి విజయం సాధించారు.

ఫలించని భాజపా వ్యూహాలు

ఒడిశాలో పాగా వేయడంపై భాజపా ఎప్పటినుంచో కసరత్తు చేసింది. అధికార పార్టీకి చెందిన కీలక నేతల్ని తమవైపునకు తిప్పుకుంది. వీలు చిక్కినప్పుడుల్లా ప్రధాని నరేంద్రమోదీతో ప్రచార సభలు నిర్వహించి... పదేపదే అభివృద్ధి మంత్రం జపించారు. అయినప్పటికీ నవీన్ పట్నాయక్​ను ఢీ కొట్టలేకపోయింది భాజపా. లోక్​సభ ఎన్నికల్లో మాత్రం ఇక్కడ బీజేడీకి గట్టి పోటీనిచ్చింది.

Last Updated : May 24, 2019, 8:18 AM IST

ABOUT THE AUTHOR

...view details