'అనారోగ్యం వల్లే ఈ నిర్ణయం' కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నూతన ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగలేనని అందులో పేర్కొన్నారు. అనారోగ్యం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు.
ఆరోగ్యం, చికిత్సపై దృష్టి పెట్టడం కోసం నూతన భాజపా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండలేనని మోదీకి తెలియజేశారు జైట్లీ.
"నా కోసం, నా ఆరోగ్యం, చికిత్స కోసం కొంత సమయం ఇవ్వాలని నేను మిమ్మల్ని(మోదీ) కోరుతున్నా. అందువల్ల నూతన ప్రభుత్వంలో ఎలాంటి బాధ్యతలు స్వీకరించకూడదని నిర్ణయించుకున్నా."
--- అరుణ్ జైట్లీ, ఆర్థిక మంత్రి.
కొంతకాలంగా జైట్లీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఇప్పటికే పలుమార్లు విదేశాలకు వెళ్లి వచ్చారు.
ఇదీ చూడండి:నరేంద్రుడి పాలనకు ఎన్ఆర్ఐలు ఫిదా