కేంద్ర మాజీమంత్రి, భాజపా సీనియర్ నేత అరుణ్ జైట్లీ అంత్యక్రియలు నేటి మధ్యాహ్నం పూర్తవనున్నాయి. గత కొంతకాలంగా దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న జైట్లీ... శనివారం ఆరోగ్యం క్షీణించి తుదిశ్వాస విడిచారు.
నిగంబోధ్ఘాట్లో అంత్యక్రియలు

ఉదయం 10 గంటల వరకు కైలాశ్నగర్లోని జైట్లీ నివాసంలోనే ఆయన పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. తర్వాత భాజపా కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ 11 గంటల నుంచి 1.30 నిమిషాల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం 1.30కు జైట్లీ అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 2.30 నిమిషాలకు యమునా తీరంలోని నిగంబోద్‌ఘాట్‌లో జైట్లీ అంతిమ సంస్కారాలు జరుగుతాయని భాజపా వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చూడండి: 'భాజపా ట్రబుల్ షూటర్‌గా జైట్లీ ముద్ర ప్రత్యేకం'