తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​ అంశంపై కాంగ్రెస్​ నేడు విస్తృతస్థాయి సమావేశం

అందాల లోయ జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి రద్దు అంశంపై.. కాంగ్రెస్​ పార్టీ నేడు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుంది. సీడబ్ల్యూసీ భేటీకి ముందురోజు జరిగే ఈ సమావేశంలో కేంద్రం నిర్ణయంపై అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయనుంది పార్టీ అధిష్ఠానం.

కశ్మీర్​ అంశంపై కాంగ్రెస్​ నేడు విస్తృతస్థాయి సమావేశం

By

Published : Aug 9, 2019, 5:40 AM IST

Updated : Aug 9, 2019, 6:48 AM IST

కశ్మీర్​ అంశంపై కాంగ్రెస్​ నేడు విస్తృతస్థాయి సమావేశం

జమ్ముకశ్మీర్​లో అధికరణ 370 రద్దుపై కాంగ్రెస్​ పార్టీ నేడు విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తోంది. ఈ అంశంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. కేంద్రం నిర్ణయంపై సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

కాంగ్రెస్​ నూతన సారథిని ఖరారు చేసేందుకు శనివారం కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కానుంది. సరిగ్గా ఒక్కరోజు ముందు నేడు జరిగే ఈ విస్తృతస్థాయి సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, బాధ్యులు, సీఎల్పీ నేతలు,​ ఎంపీలు ఇతర సీనియర్​ నాయకులు హాజరుకానున్నారు.

భిన్నాభిప్రాయాలు..

ఆగస్టు 6న జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో పార్టీ సీనియర్లు జనార్దన్​ ద్వివేది, దీపేందర్​ హుడా, జ్యోతిరాధిత్య సింధియాలు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. అయినప్పటికీ సీడబ్ల్యూసీ... కేంద్రం ఏకపక్ష, ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయం తీసుకుందని చేసిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. కశ్మీర్​ పునర్విభజన బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కాంగ్రెస్​.

ప్రజాభిప్రాయాలు తెలుసుకోవడంలో కాంగ్రెస్​ విఫలమైందని మరో నేత అనిల్​ శాస్త్రి అన్నారు. జమ్ముకశ్మీర్​పై కేంద్రం నిర్ణయం పూర్తిగా ఖండించదగ్గవి కావని, సానుకూలాంశాలు చాలానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్​ నేత, కేంద్ర మాజీ మంత్రి కరణ్​ సింగ్​.ఈ తరుణంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన వైఖరిపై నేడు జరిగే భేటీలో వ్యూహం ఖరారు చేయనున్నారు.

ఇదీ చూడండి:దుమారం రేపిన డోభాల్​పై ఆజాద్ వ్యాఖ్యలు..!

Last Updated : Aug 9, 2019, 6:48 AM IST

ABOUT THE AUTHOR

...view details