తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'370' రద్దుతో కశ్మీర్​లో ఉగ్రవాదానికి స్వస్తి: షా

ఆర్టికల్​ 370 రద్దు వల్ల కశ్మీర్​లో ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పునరుద్ఘాటించారు. ఇకపై రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ధీమా వ్యక్తం చేశారు.

'370' రద్దుతో కశ్మీర్​లో ఉగ్రవాదానికి స్వస్తి: షా

By

Published : Aug 11, 2019, 3:32 PM IST

Updated : Sep 26, 2019, 3:57 PM IST

ఆర్టికల్​ 370తో కశ్మీర్ ​వాసులకు ఇప్పటివరకు జరిగింది ఏంలేదని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పునరుద్ఘాటించారు. జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని విశ్వసించినట్టు తెలిపారు. తమిళనాడులో రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు జీవితం ఆధారంగా రచించిన పుస్తక ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న అమిత్​ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

'370' రద్దుతో కశ్మీర్​లో ఉగ్రవాదానికి స్వస్తి

"ఆర్టికల్ 370ని రద్దు చేయాలా వద్దా అని​ ఒక చట్టసభ్యుడిగా నా మనసులో కొంచెం కూడా సందేహం లేదు. ఆర్టికల్​ 370తో దేశానికి, కశ్మీర్​కు మంచి జరగలేదని నేను విశ్వసిస్తున్నా. ఎప్పుడో దాన్ని తొలగించాల్సి ఉంది. ఆర్టికల్​ 370 రద్దు అనంతరం ఏం జరుగుతుందనే సందేహమూ నాకు లేదు. కశ్మీర్​లో ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోతుంది. రాష్ట్రాభివృద్ధిలో కశ్మీర్​ ముందడుగు వేస్తుందని నేను నమ్ముతున్నా."
--- అమిత్​షా, కేంద్ర హోంమంత్రి.

ఆర్టికల్​ 370 రద్దు తీర్మానం, జమ్ముకశ్మీర్​ విభజన బిల్లుకు పార్లమెంట్​ ఇటీవలే ఆమోద ముద్రవేసింది.

ఇదీ చూడండి:- 15 కిలోమీటర్ల జాతీయ జెండాతో మానవహారం

Last Updated : Sep 26, 2019, 3:57 PM IST

ABOUT THE AUTHOR

...view details