తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'శివసేన-భాజపాది అసమర్థ, అవినీతి ప్రభుత్వం' - గోడ కూలడం

మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి. భారీ వర్షాలకు గోడ కూలి 18 మంది మరణించిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశాయి. శివసేన-భాజపాది అహంకారపూరిత, అవినీతిమయ, అసమర్థ ప్రభుత్వమని కాంగ్రెస్ విమర్శించింది.

'శివసేన-భాజపాది అసమర్థ, అవినీతి ప్రభుత్వం'

By

Published : Jul 2, 2019, 6:50 PM IST

మహారాష్ట్రలోని శివసేన-భాజపా సంకీర్ణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. శివసేన-భాజపా కూటమిది.... అహంకారపూరిత, అవినీతిమయ, అసమర్థ ప్రభుత్వమని కాంగ్రెస్ అభివర్ణించింది. ఈ వరదలకాలంలో ముంబయిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించింది.

" అధికారముందనే అహంకారంతో...ఈ అసమర్థ, అవినీతిమయ శివసేన-భాజపా కూటమి ప్రభుత్వం.. ఈ వరదల కాలంలో ముంబయిని పూర్తిగా విస్మరించింది. గత 25 సంవత్సరాలుగా ఇలాగే చేస్తోంది. ముంబయిలో 18 మంది మరణించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో వరదల వల్ల మౌలిక సదుపాయాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఈ దారుణాలకు రాష్ట్రప్రభుత్వం బాధ్యత వహిస్తోందో లేదో తెలపాలి."-రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ట్వీట్​

దేవుడే దిక్కు...

"శివసేన అవినీతిని అడ్డుకునే ధైర్యం భాజపాకి లేదు. ఇక ముంబయి వాసులకు దేవుడే దిక్కు."- అశోక్​ చవాన్​, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్​

ఆడిట్​ చేయండి...

భారీ వరదలకు ముంబయిలోని ప్రాంతాలు జలమయం కావడం... గోడలు కూలి పలువురు మృతిచెందారు. ఈ నేపథ్యంలో రోడ్లు, వంతెనలు, భవనాలపై ఆడిట్​ నిర్వహించాలని ఎన్​సీపీ నేత ధనుంజయ్​ ముండే డిమాండ్ చేశారు.

ఇదీ జరిగింది..

మహారాష్ట్రలో భారీ వర్షాలు సృష్టించిన బీభత్సానికి గోడలు కూలి ఇప్పటికే 30 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముంబయి మలాద్​లోని గోడ కూలి మరణించిన వారు 21 మంది ఉన్నారు. ఈ ఘటనలో మరో 50 మంది గాయపడ్డారు. పూనేలో ఆరుగురు, కల్యాణ్​లో మరో ముగ్గురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఇళ్లను వదిలి బయటకు ఎవరూ వెళ్లకూడదని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ముంబయిలో సోమవారంనాడు ముంబయిలో 375.మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 2005 జూలై 26 తరువాత ఇంత పెద్ద ఎత్తువ వర్షపాతం నమోదవడం ఇదే మొదటిసారని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: రూ.70 కోసం ఘర్షణ.. పసి బాలుడు మృతి

ABOUT THE AUTHOR

...view details