పాక్ ఆక్రమిత కశ్మీర్లోని హాజీపుర్ సెక్టార్లో పాకిస్థాన్ బార్డర్ యాక్షన్ ఫోర్స్ (బాట్) ఈనెల 12,13 తేదీల్లో ఉగ్రవాదులను భారత్లోకి పంపేందుకు ప్రయత్నించింది. ఈ కుట్రలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. పాకిస్థాన్ ప్రత్యేక దళం(ఎస్ఎస్జీ) స్థావరాలపై భారత సైన్యం గ్రనేడ్ల వర్షం కురిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను భారత సైన్యం విడుదల చేసింది.
భారత్ సైన్యం దెబ్బకు పాక్ ఉగ్రవాదుల పరుగులు - హాజీపుర్ సెక్టార్
భారత భూభాగంలోకి చొరబడేందుకు పాకిస్థానీ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. ఈనెల 12, 13 తేదీల్లో పీఓకేలోని హాజీపుర్ సెక్టార్ మీదగా తీవ్రవాదులను దేశంలోకి పంపేందుకు పాకిస్థాన్ బాట్ (బార్డర్ యాక్షన్ ఫోర్స్) చేసిన కుట్రలను భారత సైన్యం భగ్నం చేసింది.
భారత్ సైన్యం దెబ్బకు పాక్ ఉగ్రవాదుల పరుగులు
ఆగస్టులో సుమారు 15 సార్లు తీవ్రవాదులు చేసిన చొరబాటు యత్నాలను భారత బలగాలు భగ్నం చేశాయి. అయినప్పటికీ పాక్ తన ప్రయత్నాలను మానుకోలేదు.
ఇదీ చూడండి: రైల్వే: పర్యటకులకు భారత్ దర్శన్ టూరిస్ట్ ప్యాకేజీ
Last Updated : Oct 1, 2019, 12:57 AM IST