తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​ కవ్వింపు చర్యలకు జవాను బలి - Pak

జమ్ముకశ్మీర్​ పూంచ్​ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్​ దళాలు మోర్టర్​ బాంబులను విసరటం వల్ల ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

పాక్​ కవ్వింపు చర్యలకు జవాను బలి

By

Published : Jun 10, 2019, 11:04 PM IST

పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది పాకిస్థాన్​.​ సోమవారం జమ్ముకశ్మీర్​లోని పూంచ్​ జిల్లా​లో కాల్పులకు తెగబడ్డాయి పాక్​ బలగాలు. భారత జవాన్లే లక్ష్యంగా మోర్టార్​ బాంబులు విసిరాయి. ఈ దాడిలో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఓ వైపు శాంతి కోరుకుంటున్నామని చెబుతూనే... సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాకిస్థాన్​. జవాన్లు, పౌరులపై కాల్పులకు తెగబడుతోంది. తాజాగా దోడా బెటాలియన్​ ప్రాంతమే లక్ష్యంగా పాక్​ బలగాలు దాడులు జరిపినట్లు అధికారులు తెలిపారు.

కాల్పుల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సరిహద్దులో పాక్​ బలగాలకు దీటుగా బదులిస్తున్నాయి భారత దళాలు.

ఇదీ చూడండి:పాకిస్థాన్​ మాజీ అధ్యక్షుడు జర్దారీ అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details