తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మళ్లీ అదే కథ.. చొరబాటుకు చైనా విఫలయత్నం! - చైనా చొరబాటు

వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు మరోమారు చైనా ప్రయత్నించినట్టు సమాచారం. చుముర్​ ప్రాంతంలోకి భారీగా వాహనాలను తరలించేందుకు చైనా సిద్ధపడినట్టు తెలుస్తోంది. అయితే అప్పటికే ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో ఉన్న భారత సైన్యాన్ని చూసి చైనా వాహనాలు వెనుదిరిగినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

Army foiled yet another China's attempt to transgress into the Indian side of the LAC
మళ్లీ అదే కథ.. చొరబాటుకు చైనా విఫలయత్నం!

By

Published : Sep 1, 2020, 9:52 PM IST

సరిహద్దులో చైనా దుశ్చర్యలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. తాజాగా.. భారత్​వైపు వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న చుముర్​ ప్రాంతంలోకి చొరబడేందుకు చైనా ప్రయత్నించినట్టు సమాచారం. అయితే చైనా చర్యలను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టినట్టు తెలుస్తోంది.

చిపుజి క్యాంపు నుంచి దాదాపు 8 భారీ వాహనాల్లో చైనా దళాలు భారత్​లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అయితే అప్పటికే ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో ఉన్న భారత బలగాలను చూసి ఆ వాహనాలు వెనుదిరిగినట్టు పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో అదనపు బలగాలను భారత్​ మోహరించినట్టు తెలుస్తోంది. ఎల్​ఏసీ వెంబడి చైనా చొరబాట్లను అడ్డుకునేందుకు అధికారులు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్టు సమాచారం.

ఇదీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details