భారత్‌కు కీలకమైన జమ్ము-పఠాన్‌కోట్‌లోని అంతర్జాతీయ సరిహద్దును సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవణే సందర్శించారు. కతువా, సాంబా, జమ్ము, పఠాన్‌కోట్‌తో పాటు రైజింగ్ స్టార్ కార్ప్స్ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అక్కడి అధికారులతో సరిహద్దు భద్రతపై చర్చించారు.
జమ్ములో ఆర్మీ చీఫ్ పర్యటన సరిహద్దులో సైన్యం సన్నద్ధత, మౌలిక సదుపాయాల కల్పన, అంతర్గత భద్రతా విషయాలను నరవణేకు లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది వివరించారు.
జమ్ములో ఆర్మీ చీఫ్ పర్యటన పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనలు, ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలకు అరికట్టేందుకు 'జీరో టాలరెన్స్' పాలసీని తిరిగి ప్రవేశ పెట్టే విషయంపై నరవణే అధికారులతో చర్చించారు.
అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెస్ట్రన్ కమాండ్ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సరిహద్దులో దళాల ధైర్య సాహసాలను ప్రశంసించారు. శత్రువుల నుంచి దేశాన్ని రక్షించే శక్తి సామర్థ్యాలు సైన్యానికి ఉన్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
జమ్ములో ఆర్మీ చీఫ్ పర్యటన