తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​ మోహరింపులు సర్వసాధారణం: రావత్ - ఆర్మీ అధికారి

నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్ అదనపు బలగాలు మోహరిస్తోందన్న వార్తలపై స్పందించారు సైన్యాధ్యక్షుడు బిపిన్ రావత్. సైన్యం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. బలగాల మోహరింపు ప్రతిదేశానికి సాధారణమేనని, తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

పాక్​ మోహరింపులు సర్వసాధారణం: రావత్

By

Published : Aug 13, 2019, 8:36 PM IST

Updated : Sep 26, 2019, 9:57 PM IST

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందన్నారు సైన్యాధ్యక్షుడు బిపిన్ రావత్​. కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి తొలగింపుతో... పాకిస్థాన్ నియంత్రణ రేఖ వెంట అదనపు సైన్యాన్ని మోహరిస్తోందన్న సమాచారంపై ఆయన ఇలా స్పందించారు. పాక్ సైన్యం మోహరింపు సాధారణమేనని, ప్రతిదేశం ఇలా చేస్తుందని వ్యాఖ్యానించారు.

పాకిస్థాన్ తీసుకునే చర్యలపైనే నియంత్రణ రేఖ వెంట పరిస్థితులు ఆధారపడి ఉంటాయని వ్యాఖ్యానించారు రావత్. సరిహద్దు వెంట కార్యకలాపాలను పెంచాలనుకుంటే అది దాయాది ఇష్టమని స్పష్టం చేశారు.

పాక్​ మోహరింపులు సర్వసాధారణం: రావత్

"ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం. వార్తలపై భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలతో మమేకమవుతాం. ఇంతకుముందు ప్రజలతో కలసి ఉన్నాం. గత దశాబ్దాల్లో సైన్యం ప్రజలతో ఎలా మమేకమైందో వెళ్లి అడగండి. మంచి వాతావరణంలో సైన్యం ప్రజలతో కలసిపోయింది. అప్పట్లో సైన్యం, ప్రజల మధ్య బంధుత్వమనే భావన ఉండేది. నాటి వాతావరణం మళ్లీ నెలకొంటే అందరికీ బాగుంటుంది."

-బిపిన్ రావత్, సైన్యాధ్యక్షుడు

కశ్మీర్​లో ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశంతో పొరుగు దేశం ఆత్మాహుతి దాడులు, బాంబు పేలుళ్లకు ప్రయత్నించవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.

ఇదీ చూడండి: సింహం సింగిల్​గా రోడ్డెక్కి దాహం తీర్చుకుంది!

Last Updated : Sep 26, 2019, 9:57 PM IST

ABOUT THE AUTHOR

...view details