భారత్, మయన్మార్ సైన్యాలు సంయుక్తంగా తమ సరిహద్దు ప్రాంతాల్లోని ఉగ్రస్థావరాలపై భారీ ఆపరేషన్ చేపట్టాయి. మణిపుర్, నాగాలాండ్, అసోంలోని ముష్కర స్థావరాలను ధ్వంసం చేశాయి. గత నెల 16 నుంచి మూడు వారాల పాటు ఆపరేషన్ జరిగిందని రక్షణ అధికారులు వెల్లడించారు.
భారత్-మయన్మార్ మధ్య 1,645 కి.మీ సరిహద్దు ఉంది. తీవ్రవాదం ఎక్కువగా ఉండే మణిపుర్, నాగాలాండ్ సహా పలు ఈశాన్య రాష్ట్రాలతో మయన్మార్ సరిహద్దు పంచుకుంటోంది.
ఆపరేషన్ సన్రైజ్-1
ముష్కరుల ఆట కట్టించేందుకు ఇరుదేశాల సైన్యాలు మూడు నెలల కిందట 'ఆపరేషన్ సన్రైజ్' పేరుతో దాడులు నిర్వహించాయి. పలు తీవ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాయి.