తెలంగాణ

telangana

ETV Bharat / bharat

117 ఏళ్ల తర్వాత అరేబియా సముద్రంలో ఇదే తొలిసారి - అరేబియా సముద్రంలో ఈ ఏడాది 4 తుపానులు సంభవించాయి.

అరేబియా సముద్రంలో ఈ ఏడాది 4 తుపానులు సంభవించాయి. ఈ సముద్రంలో ఇలా ఒకే ఏడాది నాలుగు తుపానులు సంభవించడం 117 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమమని వాతావరణ శాఖ వెల్లడించింది.

Arabian Sea sees 4 cyclones in a year, first time after 1902

By

Published : Nov 9, 2019, 11:31 AM IST

అరేబియా సముద్రంలో ఈ ఏడాది వరుస తుపానులు భారత్​ను వణికించాయి. ఒకదాని తర్వాత ఒకటి వరుస పెట్టి 4 తుపానులు ఏర్పడ్డాయి. ఈ విధంగా జరగటం 117 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. గతంలో 1902లో ఇదే విధంగా జరిగింది.

అరేబియా సముద్రంలో తుపానులు సంభవించడం సాధారణ విషయమే అయినప్పటికీ... అక్టోబర్, నవంబర్​లో ఏర్పడటం చాలా అరుదు. సాధారణంగా ఈ సమయంలో బంగాళాఖాతంలో తుపానులు ఏర్పడతాయి. తక్కువ ఒత్తిడి ఏర్పడటం తుపానులు సంభవించడానికి ప్రధాన కారణం. ఈ ఏడాది ఇప్పటికే ఫొణి, బుల్​బుల్​ తుపానులు బంగాళాఖాతంలో ఏర్పడ్డాయి.

ఈ ఏడాది అరేబియా సముద్రంలో వాయు, హిక్కా, క్యార్​​, మహా తుపానులు సంభవించాయి. తొలి తుపాను 'వాయు' గత జూన్​లో గుజరాత్ తీరంలో ఏర్పడింది. ఆ తర్వాత సెప్టెంబర్​లో హిక్కా సంభవించింది. అక్టోబర్​లో ఏర్పడ్డ క్యార్​, మహా తుపానులు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్​ రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి.

బంగాళాఖాతం మాదిరిగా ఇతర తుపానుల కారణంగా అరేబియా సముద్రంలో తుపానులు సంభవించవు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 27 నుంచి 29 డిగ్రీల సెల్సియస్​కు చేరితే.. తుపానులు సంభవించడానికి అవకాశం ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details