తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అప్పుడు స్వతంత్రం- ఇప్పుడు ప్రజాస్వామ్యం'

దేశ బానిస సంకెళ్లు తెంచటానికి పోరాడిన వీరవనిత ఆమె. జవహర్‌ లాల్‌ నెహ్రూ, సరోజిని నాయుడు లాంటి వారు ఆమె ఆతిథ్యం స్వీకరించారు. స్వాతంత్ర్యానికి ముందు ఓ మహిళ కథ ఇది. ఇప్పుడూ ఆమె పాటుపడేది దేశం కోసమే. ఎలా? ఎవరామె?

'అప్పుడు స్వతంత్రం- ఇప్పుడు ప్రజాస్వామ్యం'

By

Published : Mar 25, 2019, 6:08 AM IST

'అప్పుడు స్వతంత్రం- ఇప్పుడు ప్రజాస్వామ్యం'
ఈమె మహారాణి దేవి. వయసు 110 ఏళ్లు. ఉత్తర్​ప్రదేశ్​ జౌన్‌పూర్‌ జిల్లాలో అత్యంత వయస్కురాలైన ఓటరు ఈమె. మొదటి లోక్‌సభ ఎన్నికలు మొదలు... తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ క్రమం తప్పకుండా ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. మహారాణి దేవి స్వాతంత్ర్యోద్యమ సమయంలో మహిళా సంఘాలకు నాయకత్వం వహించారు. ఆ కాలంలో ఈ పెద్దావిడ ఇంటిని జవహర్‌ లాల్‌ నెహ్రు, సరోజిని నాయుడు లాంటి వారు సందర్శించారు.

స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ నుంచి ప్రతి ఎన్నికలో దేవి భాగస్వామి అయ్యారు. ఓటు వేసి, ప్రజలకు ప్రేరణ కలిగించేవారు. ఆవిడ భర్త రామేశ్వర ప్రసాద్‌ సింగ్‌ కొన్ని నెలలు జైలులో ఉన్నారు. ఆయన లేకుండానే మహిళా సంఘాన్ని ఏర్పరచి అధ్యక్షత వహించారు దేవి. ర్యాలీలు కూడా తీసేవారు.

- విమలా సింగ్‌, సామాజిక కార్యకర్త

ABOUT THE AUTHOR

...view details