"కాంగ్రెస్.. 130 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ. దేశ స్వతంత్ర పోరాటానికి నాయకత్వం వహించింది. దేశాన్ని, వ్యవస్థలను నిర్మించింది. దేశం గర్వించేలా చేసింది. ఎందుకు ప్రధాని గందరగోళంలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షాన్ని దేశ వ్యతిరేకిగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? నేను ఆయనకు ఒకటే చెప్పదలచుకున్నాను. దేశ ప్రధాని ఎలా మాట్లాడాలో అలా మాట్లాడండి. వైఫల్యాల నుంచి ప్రధాని పలాయనం చిత్తగిస్తున్నారు. మేము వాటిని వెలుగులోకి తెస్తున్నాం." -ఆనంద్ శర్మ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
2014 ఎన్నికల ప్రచారంలో మోదీ ఇచ్చిన వాగ్దానాలను ఎందుకు నేరవేర్చలేదో దేశ ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు ఆనంద్ శర్మ. సైన్యం దేశానికి చెందినది మాత్రమేనని ఏ పార్టీ సొత్తు కాదన్నారు. దేశ సైనికులు ప్రాణ త్యాగం చేసింది ఓట్ల కోసం కాదు.. దేశం కోసమని ప్రధాని గుర్తుంచుకోవాలని సూచించారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు.