తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దీక్షలోనే దీదీ... సుప్రీంలో సీబీఐ

బోర్డు పరీక్షలు సమీపిస్తున్నందున లౌడ్​స్పీకర్లతో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు శుక్రవారంతోనే దీక్షను ముగిస్తానని ప్రకటించారు మమతా బెనర్జీ. మరోవైపు సీబీఐ అభ్యర్థనపై అత్యవసర విచారణ జరపనుంది సుప్రీం కోర్టు.

మమతా బెనర్జీ, సీబీఐ

By

Published : Feb 5, 2019, 6:53 AM IST

Updated : Feb 5, 2019, 8:05 AM IST

మమతా బెనర్జీ, సీబీఐ వివాదం
సీబీఐ చర్యలకు నిరసనగా చేపట్టిన సత్యాగ్రహ దీక్ష శుక్రవారం వరకు కొనసాగుతుందని పశ్చిమ్ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బోర్డు పరీక్షలు దగ్గర్లో ఉండటంచేత లౌడ్​ స్పీకర్లతో విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదని దీదీ నిర్ణయించారు.

రాష్ట్ర పోలీసులను సీబీఐ అగౌరపరిచిందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి చేపట్టిన సత్యాగ్రహ దీక్ష మంగళవారంతో మూడో రోజుకు చేరకుంది. కోల్​కతా నగరం మధ్యలో ఉన్న మెట్రో ఛానల్ వద్ద మమతా ధర్నా చేస్తున్నారు. గతంలోనూ టాటా మోటార్స్ కర్మాగారం వివాదంలో 26 రోజుల పాటు ఇక్కడే ఉపవాస దీక్ష చేశారు.

మమత చేస్తున్న దీక్షకు విపక్షాలు మద్దతు ప్రకటించాయి. సీబీఐను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ తదితర పార్టీలు ఆరోపిస్తున్నాయి. భాజపా మాత్రం అవినీతికి మద్దతుగా దీక్ష చేస్తున్నారని విమర్శిస్తోంది.

నేడు సుప్రీం విచారణ

శారద స్కాంలో పోలీస్ కమిషనర్​ రాజీవ్​ కుమార్​ను విచారణకు సహకరించేలా ఆదేశించాలంటూ సుప్రీం కోర్టును సీబీఐ ఆశ్రయించింది. ఈ విషయమై మంగళవారం సుప్రీం అత్యవసర విచారణ చేపట్టనుంది.

శారద చిట్​ఫండ్​ కుంభకోణంలో రాజీవ్ కుమార్​కు వ్యతిరేకంగా ఆధారాలున్నాయని సుప్రీం కోర్టకు సీబీఐ తెలిపింది. కుంభకోణంలో రాజీవ్ పాత్ర ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందని, విచారణకు అతను సహకరించట్లేదని సీబీఐ ఆరోపించింది. కమిషనర్ వెంటనే లొంగిపోయి విచారణకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది సీబీఐ.

Last Updated : Feb 5, 2019, 8:05 AM IST

ABOUT THE AUTHOR

...view details