తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్- తీవ్రవాది హతం

జమ్ముకశ్మీర్​ బుద్గామ్​ జిల్లాలో తీవ్రవాదులు, భద్రత దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ముష్కరుడు హతమయ్యాడు. పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు జవాన్లు.

By

Published : Jun 30, 2019, 9:52 AM IST

Updated : Jun 30, 2019, 10:08 AM IST

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్- తీవ్రవాది హతం

కశ్మీర్​లో ఎన్​కౌంటర్- తీవ్రవాది హతం

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా బుద్గామ్​ జిల్లాలోని చదూర ప్రాంతంలో భద్రత దళాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.

జిల్లాలోని చదూర, బుగమ్​ ప్రాంతాల్లో ముష్కరులు దాగి ఉన్నారన్న సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టాయి భద్రత దళాలు. ఈ నేపథ్యంలో జవాన్లపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఇరువురి మధ్య జరిగిన భీకర పోరులో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

అదనపు బలగాలను మోహరించి ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అధికారులు.

ఇదీ చూడండి:రోగిని బెడ్​షీట్​తో లాక్కెళ్లిన ఆసుపత్రి సిబ్బంది

Last Updated : Jun 30, 2019, 10:08 AM IST

ABOUT THE AUTHOR

...view details