తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాయ్​బరేలీ నుంచి  సోనియా గాంధీ నామినేషన్ - priyanka gandhi

యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియాగాంధీ యూపీలోని రాయ్​బరేలీ లోక్​సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. సోనియా వెంట కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉన్నారు.

రాయ్​బరేలీ నుంచి  సోనియా నామినేషన్

By

Published : Apr 11, 2019, 2:46 PM IST

Updated : Apr 11, 2019, 5:23 PM IST

యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ ఉత్తర్​ప్రదేశ్​లోని రాయ్​బరేలీ లోక్​సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం భారీ రోడ్​షో నిర్వహించారు. సోనియా గాంధీ వెంట కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, అల్లుడు రాబర్ట్ వాద్రా ఉన్నారు.

రాయ్​బరేలీ నుంచి సోనియా గాంధీ నామినేషన్

2004 నుంచి సోనియాగాంధీ రాయ్​బరేలీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2006 ఉప ఎన్నికలు, 2009, 2014 సాధారణ ఎన్నికల్లో సోనియా విజయఢంకా మోగించారు. ఇటీవలే భాజపా తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్​ మాజీ నేత దినేష్​ ప్రతాప్​ సింగ్​ సోనియాతో రాయ్​బరేలీ స్థానంలో పోటీపడుతున్నారు.

కాంగ్రెస్​కు పోటీగా రాయ్​బరేలీలో తమ అభ్యర్థిని నిలపబోమని ఇప్పటికే ఎస్పీ-బీఎస్పీ కూటమి ప్రకటించింది. రాయ్​బరేలీలో ఐదో దశలో మే 6న పోలింగ్​ జరగనుంది.

"భారత దేశ చరిత్రలో చాలామంది ప్రజలకంటే తామే ఎక్కువని అనుకున్నారు. ప్రజలకంటే పెద్దవారెవరూ లేరు. గత ఐదేళ్లలో దేశ ప్రజల కోసం మోదీ చేసిందేమీ లేదు. ఆయన గొప్పతనం ఎన్నికల అనంతరం బయటపడుతుంది." -రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

Last Updated : Apr 11, 2019, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details