తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా మేనిఫెస్టో ఓ ఏకాకి స్వరం: రాహుల్​ - RAHUL

'భాజపా ఎన్నికల మేనిఫెస్టో ఓ ఒంటరి వ్యక్తి గొంతుకను వినిపిస్తోంది తప్ప మరేంలేదని' కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. మేనిఫెస్టోలో ముందుచూపు కొరవడిందని, అహంకారం ప్రతిబింబిస్తోందని ట్వీట్ చేశారు రాహుల్.

భాజపా మేనిఫెస్టో ఓ ఏకాకి స్వరం: రాహుల్

By

Published : Apr 9, 2019, 11:55 AM IST

భాజాపా ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అదో 'ఒంటరి వ్యక్తి' స్వరం వినిపిస్తోంది తప్ప మరేం లేదని అభివర్ణించారు.

"కాంగ్రెస్​ ఎన్నికల మేనిఫెస్టోను భాగస్వాములందరితో చర్చించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించాం. భాజపా మేనిఫెస్టోను ఒక చీకటి గదిలో తయారు చేశారు. అదో ఏకాకి గొంతుకలా ఉంది. అహంకారం ప్రతిబింబిస్తోంది. ముందుచూపు కొరవడింది."
-ట్విట్టర్​లో రాహుల్ గాంధీ.

ఇదీ చూడండి: 'కాపలాదారుడిగా దేశ ఖజానాను సంరక్షిస్తా'

ABOUT THE AUTHOR

...view details