తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అలా చేసే ఏ ప్రయత్నాన్ని భారత్​ అంగీకరించదు'

చైనాతో సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖను ఏకపక్షంగా మార్చడానికి చేసే ఏ ప్రయత్నాన్ని భారత్​ అంగీకరించదని ఉద్ఘాటించారు విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్​. ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలను పరస్పరం గౌరవిస్తూ.. సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు ప్రయత్నించాలన్నారు.

Any attempt to unilaterally change status quo of LAC unacceptable: EAM on border row with China
'అలా చేస్తే భారత్​ చూస్తూ ఊరుకోదు'

By

Published : Nov 1, 2020, 6:56 AM IST

చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు విదేశాంగ మంత్రి జైశంకర్​. చైనాతో సరిహద్దు వాస్తవాదీన రేఖను ఏకపక్షంగా మార్చడానికి చేసే ఏ ప్రయత్నాన్ని భారత్​ అంగీకరించదని ఉద్ఘాటించారు. రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాన్ని గౌరవిస్తూ.. సరిహద్దుల్లో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు ప్రయత్నించాలన్నారు.

సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంత వాతావరణం భారత్​-చైనాల మధ్య విస్తృత సహకారానికి ఆధారంగా నిలిచాయని.. అయితే కరోనా వల్ల సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. ఆల్​ ఇండియా రేడియోలో ప్రసారమైన సర్దార్​ పటేల్​ మెమోరియల్​లో ప్రసంగించారు జైశంకర్​.

వారసత్వంగా వచ్చిన సవాళ్లను, కొత్త పరిస్థితులను పరిష్కరించడం వల్లే మూడు దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు స్థిరంగా ఉన్నాయని విదేశాంగ మంత్రి పేర్కొన్నారు.

సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రస్తావిస్తూ.. భారత్​ దీనిని ఎదుర్కోవడంలో రాజీపడాల్సిన అవసరం లేదన్నారు విదేశాంగ మంత్రి. ప్రపంచం అభివృద్ధి చెందుతున్న క్రమంలో తన పొరుగు దేశాలపై భారత్​ అత్యంత శ్రద్ధ చూపుతుందన్నారు.

ఇదీ చూడండి:'చైనా ఆక్రమణ' వ్యాఖ్యలపై రాజ్​నాథ్ మండిపాటు

ABOUT THE AUTHOR

...view details