తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎర్రకోట వద్ద లేజర్‌ కళ్ల నిఘా

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగువ వేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ వేడుక జరగటానికి కొన్ని రోజుల నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే ఈసారి భద్రత ను భారత్​లో తయారైన యాంటీ డ్రోన్​ సిస్టమ్​ ద్వారా పర్యవేక్షించారు.

anti drone system developed near the Red Fort
ఎర్రకోట వద్ద లేజర్‌ కళ్లు

By

Published : Aug 15, 2020, 10:47 PM IST

ప్రధాని జాతీయ జెండాను ఆవిష్కరించడానికి ముందు ఎన్నోరోజుల నుంచే ఎర్రకోట వద్ద అధికారులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తుంటారు. దానిలో భాగంగానే ఈసారి భారత్‌లో తయారైన యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ కూడా ప్రధాని మోదీ భద్రతను తన లేజర్‌ కళ్లతో పర్యవేక్షించింది. ఇది వేదిక సమీపంలో ఆకాశం మొత్తాన్ని స్కాన్ చేసి, డ్రోన్ల జాడను పట్టేస్తుంది. డీఆర్‌డీఓ అభివృద్ది చేసిన ఈ లేజర్ ఆయుధం ఎర్రకోటకు సమీపంలోని మూడు కిలో మీటర్ల పరిధిలో తిరుగాడే మైక్రో డ్రోన్లపై కన్నేసింది.

ఇది వాటిని గుర్తించి, కదలకుండా చేయగలదు. అలాగే దేశ పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లో ఇటీవల కాలంలో పెరిగిన డ్రోన్‌ కార్యకలాపాలను ఇది సమర్థవంతంగా ఎదుర్కోగలదని వారు వెల్లడించారు. కాగా, దిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details